Lok Sabha: లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుల నినాదాలు

  • రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో కొనసాగుతోన్న చర్చ
  • లోక్‌సభలో సేవ్‌ ఇండియా, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు
  • రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైన నేపథ్యంలో ప్రతిపక్షాల నేతలు నినాదాలతో హోరెత్తించారు. లోక్‌సభలో సేవ్‌ ఇండియా, సేవ్ డెమోక్రసీ అంటూ సభ్యులు నినాదాలు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు, రాజ్యసభలో పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు చర్చకు పట్టుబడుతున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై రాజ్యసభలో వామపక్ష సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
Lok Sabha
Rajya Sabha
Congress

More Telugu News