Chiranjeevi: యాక్షన్ తో రఫ్ ఆడించేస్తున్న చిరూ

  • వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రం 
  • 20 కోట్ల రూపాయలతో భారీ సెట్ 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
కొరటాల - చిరంజీవి సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా చకచకా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ - కోకాపేట్ లో, ఓ దేవాలయంతో కూడిన కాలనీ సెట్ వేశారు. ఈ ఒక్క సెట్ కోసమే 20 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఇక్కడ చిరంజీవి .. తదితరులపై యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.

తనపై విరుచుకుపడిన విలన్ గ్యాంగ్ ను చిరంజీవి తనదైన స్టైల్లో రఫ్ ఆడించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. దేవాలయ భూముల ఆక్రమణ .. ఆ వైపు నుంచి జరుగుతున్న అవినీతికి సంబంధించిన అంశాలతో ఈ కథను తయారు చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా త్రిష మెరవనుందని చెబుతున్నారు.
Chiranjeevi
Trisha
Manisharma
Koratala Siva Movie

More Telugu News