డీఎంకే వ్యూహాలు రూపొందించే బాధ్యతలు ప్రశాంత్ కిశోర్ కు అప్పగింత!
- త్వరలో తమిళనాడులో ఎన్నికలు
- పీకేను వ్యూహకర్తగా నియమించిన స్టాలిన్
- ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాల రూపకల్పనలో మేటి అని పీకేకి పేరు
ఈసారి ఎన్నికల్లో రజనీకాంత్, కమల్ హాసన్ ల ప్రభావం గణనీయంగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఓట్లు చీలకుండా ఉండేలా వ్యూహాలు రూపొందించేందుకు ప్రశాంత్ కిశోర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన గతంలో బీజేపీ అగ్రనేతలకు సైతం వ్యూహకర్తగా పనిచేశారు.