Corona Virus: కరోనా వైరస్ మృతుల అంత్యక్రియలపై చైనా కఠిన ఆంక్షలు

  • చైనాలో కరోనా వైరస్ విపత్తు
  • 300 మందికి పైగా మృతి
  • మృతులకు వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలన్న చైనా
చైనాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వుహాన్ నగరంలో ప్రబలిన ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా ఇతర ప్రాంతాలకు పాకడంతో చైనాలో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలమందికి ఈ వ్యాధి సోకినట్టు చైనా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, కరోనా వైరస్ కారణంగా మరణించినవారి అంతిమ సంస్కారాలపై చైనా కఠిన ఆంక్షలు విధించింది.

ఆర్భాటంగా అంత్యక్రియలు నిర్వహించవద్దని, దగ్గర్లో ఉన్న శ్మశానవాటికలో వెంటనే అంత్యక్రియలు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. మృతదేహాలను దూరప్రాంతాలకు తీసుకెళ్లవద్దని, వాటిని ఎక్కువసేపు భద్రపరచవద్దని సూచించింది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చేసేందుకు ఈ చర్యలు తప్పనిసరి అని చైనా ప్రభుత్వం భావిస్తోంది.
Corona Virus
China
Funerals
Restrictions

More Telugu News