NGO: ఏపీ ఎన్జీవో సంఘం నూతన అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ రెడ్డి

  • ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
  • ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు
  • సహాధ్యక్షుడిగా పురుషోత్తం నాయుడు
ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా పురుషోత్తం నాయుడు ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్జీవో ఉద్యోగులందరికీ తన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తామని, ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. పాలనా రాజధానిగా విశాఖపట్టణం అయితే, అక్కడికి వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
NGO
president
Chandrashekar reddy
Scretaray
Bandi srinivas
Andhra Pradesh

More Telugu News