Amaravati: జగన్ మూర్ఖంగా ముందుకెళ్తున్నారు: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

  • రాజధాని విషయంలో మూర్ఖత్వపు నిర్ణయాలు
  • కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప ఈ నిర్ణయాలు ఆగవు
  • హైకోర్టును కాదని కర్నూలుకు కార్యాలయాలు  తరలించడమేంటి?
రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ మూర్ఖంగా ముందుకెళ్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఈ మూర్ఖత్వపు నిర్ణయాలు ఆగవని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు కాదని కర్నూలుకు కార్యాలయాలను తరలించడమేంటని ప్రశ్నించారు.

విశాఖలో భూములు కొన్నవారు లాభపడేందుకే రాజధానిని తరలిస్తున్నారా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే కనుక సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని మార్పును కేంద్రం అంత సులభంగా ఒప్పుకునే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. రాజధానిని తరలించవద్దని నిరసనలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన మండిపడ్డారు.
Amaravati
Jagan
cm
Vadde shobanadriswara Rao

More Telugu News