BJP: అమరావతి బయలుదేరిన బీజేపీ, జనసేన నేతలు

  • గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో బీజేపీ, జనసేన నేతల సమావేశం
  • రాష్ట్రంలోని సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయం
  • రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్న నేతలు
ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై కలిసి పోరాడాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న బీజేపీ, జనసేన నేతలు ఈ రోజు ఉదయం గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో కీలక సమావేశం జరిపారు. కొన్ని నిమిషాల పాటు సాగిన వారి సమావేశం ముగిసింది. రాజధానితో పాటు రాష్ట్రంలోని ఇతర సమస్యలపైనా కలిసి పనిచేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని రైతులకు అండగా నిలవాలని బీజేపీ, జనసేన నేతలు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం అమరావతి రాజధాని గ్రామాల పర్యటనకు బయలుదేరారు. కాగా, అమరావతి రాజధాని ప్రాంతంలో 47వ రోజు రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి.
BJP
Janasena
Amaravati

More Telugu News