కలెక్టర్లకు జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు
- మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితుల పిటిషన్ పై విచారణ
- కలెక్టర్, అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరించారు
- కలెక్టర్లకు రూ.2 వేలు చొప్పున జరిమానా
- ఆర్డీఓ జయచందర్ రెడ్డికి 2నెలల జైలు శిక్ష
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డును ఇచ్చారని 2018లో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను రైతులకు వివరించాలని, వారి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని.. విచారణ జరిపి ఆర్డర్‌ను ఇవ్వాలని గతంలో కోర్టు అధికారులను ఆదేశించింది. కానీ, రైతుల అభ్యంతరాలు వినకుండానే డిక్లరేషన్, అవార్డును అధికారులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ.. బాధిత రైతులు గత ఏడాది మేలో మరోసారి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తాజాగా విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.