CM Ramesh: తన కుమారుడి వివాహానికి రాష్ట్రపతిని ఆహ్వానించిన సీఎం రమేశ్

  • సీఎం రమేశ్ ఇంట పెళ్లిసందడి
  • ఫిబ్రవరి 7న సీఎం రమేశ్ తనయుడు రిత్విక్ వివాహం
  • ఇటీవలే పూజతో రిత్విక్ కు నిశ్చితార్థం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. రిత్విక్ వివాహం పూజతో నిశ్చయమైంది. ఇటీవల దుబాయ్ లో అత్యంత ఆడంబరంగా నిశ్చితార్థం నిర్వహించారు. ఈ క్రమంలో, సీఎం రమేశ్ కుటుంబంలో పెళ్లికళ తొణికిసలాడుతోంది. సీఎం రమేశ్ ప్రముఖులకు శుభలేఖలు పంచుతూ ఢిల్లీలో సందడి చేస్తున్నారు. తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. తన కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలంటూ రాష్ట్రపతిని ఆహ్వానించారు.
CM Ramesh
Rithwik
Wedding
President Of India
BJP

More Telugu News