Suman: 'అన్నమయ్య' సినిమాను చూడటానికి థియేటర్ కి వెళితే నా కాళ్లకు నమస్కరించారు: హీరో సుమన్

  • వేంకటేశ్వరస్వామి పాత్రను ధరించడం అదృష్టం 
  • 'దేవీ'థియేటర్లో 'అన్నమయ్య' చూశాను
  • అక్కడ అలాంటి అనుభవం ఎదురైందన్న సుమన్
సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు పలు కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించారు. ఆ తరువాత ఆయన భక్తిరస చిత్రాల్లోను మెప్పించారు. ఆ తరహా సినిమాల్లో 'అన్నమయ్య' అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆ సినిమాను గురించి 'అలీతో సరదాగా' కార్యక్రమంలో సుమన్ మాట్లాడారు.

'అన్నమయ్య' సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్ర కోసం నియమ నిష్టలు పాటించాను. ఈ సినిమా ప్రివ్యూ చూడటానికి నేను హైదరాబాదులోని 'దేవీ' థియేటర్ కి వెళ్లాను. ఆ సినిమా చూస్తూనే నేను ఆడియన్స్ ను చూస్తే.. వాళ్లు కన్నీళ్లు తుడుచుకోవడం గమనించాను. సినిమా పూర్తయిన తరువాత కామెంట్స్ వినడం కోసం నేను కాసేపు అక్కడ వెయిట్ చేశాను. ఆ సమయంలో వయసులో నాకంటే పెద్దవారు కూడా వచ్చి నా కాళ్లకు నమస్కరించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతటి గొప్ప పాత్రను పోషించే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
Suman
Raghavendra Rao
Annamayya Movie

More Telugu News