Buddhavenkanna: జగన్ గారు, విజయసాయిరెడ్డి గారు వాటి గురించి మాట్లాడితే నవ్వొస్తుంది: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • పత్రికలు, పాత్రికేయ విలువల గురించి మాట్లాడుతున్నారు
  • ప్రజాధనం దోచి ఘనంగా బ్లాక్ పేపర్, ఛానల్ నిర్వహిస్తున్నారు
  • మీరు... ఇతర పత్రికలు, ఛానల్స్ ఏమి రాయాలో చెబుతున్నారా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. 'వైఎస్ జగన్ గారు, విజయసాయిరెడ్డి గారు పత్రికలు, పాత్రికేయ విలువల గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. ప్రజాధనం దోచి ఘనంగా బ్లాక్ పేపర్, ఛానల్ నిర్వహిస్తున్న మీరు... ఇతర పత్రికలు, ఛానల్స్ ఏమి రాయాలో చెబుతున్నారా?' అని ఆయన ప్రశ్నించారు.
 
'అసలు మీ బ్లాక్ పేపర్, ఛానెల్ లో ఒక్క రోజైనా పాత్రికేయ విలువలు పాటించినట్టు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పే దైర్యం ఉందా సాయిరెడ్డి గారు? అవాస్తవాలు, అసత్యాలు, అభూత కల్పనలు తప్ప సత్యానికి అర్థమే తెలియని బ్లాక్ పేపర్, ఛానల్ గురించి మీరు గొప్పలు చెప్పడం ఏంటి విజయ్ గారు?' అని ప్రశ్నించారు. కాగా, ఈనాడులో 1983లో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి ఈ రోజు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Buddhavenkanna
Telugudesam
Vijay Sai Reddy
YSRCP

More Telugu News