రాజధానిపై పోరాటాన్ని ఆపం : సీపీఐ నేత రామకృష్ణ
- రేపు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ
- బుధవారం తెనాలిలో బహిరంగ సభ
- త్వరలోనే ఛలో ఢిల్లీ కార్యక్రమం
రేపు అన్ని నియోజకవర్గాల్లో జేఏసీ బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తెనాలిలో జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్సీలను సన్మానం చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ నెలాఖరున ఢిల్లీ వెళతామని చెప్పారు. అన్ని పార్టీలతో చర్చించి మద్దతు కూడగడతామన్నారు. రాజధానిపై పోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.