తెలంగాణలో జనసేతో కలిసి ముందుకు సాగుతాం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
- త్వరలో పవన్ కల్యాణ్ తో భేటీ
- మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతికంగా వ్యవహరిస్తోంది
- దొడ్డి దారిన ఛైర్మన్ పదవులను దక్కించుకోవాలనుకుంటోంది
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ రాని స్థానాల్లో కూడా ఆ పార్టీ దొడ్డి దారిన ఛైర్మన్ పదవులను దక్కించుకోవాలనుకుంటోందని ఆరోపించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల పట్ల టీఆర్ఎస్ వైఖరి ఆక్షేపణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేను తెలంగాణలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు.