ఎప్పుడంటే అప్పుడే... 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు 'జంప్'కి సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ నేత సజ్జల!
- జగన్ అంగీకరిస్తే పార్టీలోకి జంప్
- జగన్ మాత్రం విలువలకు కట్టుబడ్డారు
- ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం
అయినా, పూర్తి బలమున్న తమ పార్టీ, వారందరినీ తెచ్చుకుని ఏం చేయాలని సజ్జల ప్రశ్నించారు. డబ్బిచ్చి ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నవతరం నాయకుడైతే, చంద్రబాబు అంతరించిపోతున్న నేత అని విమర్శలు గుప్పించారు.
జగన్ సరేనంటే ఎంతమంది వస్తారో తనకన్నా బాగా మీడియాకే తెలుసునని సజ్జల చలోక్తులు విసిరారు. కౌన్సిల్ విషయం అసలు సమస్యే కాదని, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారని అన్నారు. తన తండ్రి ఫొటో పక్కనే తన ఫొటో కూడా ఉండాలన్నదే జగన్ లక్ష్యమని, ఈ దిశగా ప్రజా సంక్షేమాన్ని ఆయన పరుగులు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. పొరపాటున కూడా డబ్బులతో సీఎం వైఎస్ జగన్ రాజకీయాలు చేయరని అన్నారు.