నిజామాబాద్ మేయర్ పీఠం ఉత్కంఠపై స్పష్టతనిచ్చిన ఎంపీ అర్వింద్
- మేయర్ స్థానానికి కావాల్సిన బలం మా వద్ద ఉంది
- కానీ ఎక్స్ అఫిషియో ఓట్లతో టీఆర్‌ఎస్ సంఖ్య పెరుగుతుంది
- మా సభ్యులు మాత్రం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపే అవకాశం లేదు
నిజామాబాద్ మేయర్ పీఠం ఉత్కంఠపై ఎంపీ అర్వింద్ స్పందించి, తమ పార్టీ వైఖరిపై స్పష్టతనిచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేయర్ స్థానానికి కావాల్సిన బలం తమ వద్ద ఉందని చెప్పుకొచ్చారు. కానీ, ఎక్స్ అఫిషియో ఓట్లతో టీఆర్‌ఎస్ సంఖ్య పెరుగుతుందని దీంతో తమ పార్టీకి మేయర్ పీఠం దక్కే అవకాశం అనుమానమని అన్నారు. తమ సభ్యులు మాత్రం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపే అవకాశం లేదని ఆయన చెప్పారు.