సాక్షిపై రూ. 75 కోట్లకు నారా లోకేశ్ పరువునష్టం దావా
- 'చినబాబు చిరుతిండి 25 లక్షలండి' పేరుతో సాక్షిలో కథనం
- విశాఖ జిల్లా జడ్జి కోర్టులో లోకేశ్ పరువునష్టం దావా
- తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనం ఉందని ఆరోపణ
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్... సాక్షిపై పరువునష్టం దావా వేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో వ్యాజ్యం దాఖలైంది.