ఇప్పుడు మరో బిస్కెట్ వేసి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నారు: నారా లోకేశ్
- సీఎం జగన్ పై ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
- సీమలో అనేక కంపెనీలు రాకుండా చేశారని ఆరోపణ
- అభివృద్ధికి అడ్డంకిగా మారారని విమర్శలు
మూడు ముక్కలాట తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం ఏంచేస్తారో ఏనాడైనా చెప్పారా? అంటూ ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం కులం, ప్రాంతం, మతం పేరుతో ప్రజలు కొట్టుకుని చావాలా? అంటూ నిలదీశారు. "ఉత్తరాంధ్ర, రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్. ఉత్తరాంధ్ర యువత ఉపాధి పొందుతున్న ఐటీ కంపెనీలను విశాఖ నుంచి హైదరాబాదుకు తరిమేస్తున్నారు. ఐటీ సెజ్ ను ఖాళీ చేయిస్తున్నారు" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.