చిచ్చరపిడుగులా చెలరేగిన అయ్యర్... కివీస్ తో తొలి టి20లో టీమిండియాదే విజయం
- 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
- మరో ఓవర్ మిగిలుండగానే పని పూర్తి
- 5 ఫోర్లు, 3 సిక్సులు బాదిన అయ్యర్
- కేఎల్ రాహుల్ ఫిఫ్టీ, రాణించిన కోహ్లీ
204 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 142 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, శ్రేయాస్ అయ్యర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్ గా ఓ సిక్సర్ బాది మ్యాచ్ ను ముగించాడు. ఈ ముంబై బ్యాట్స్ మన్ కేవలం 29 బంతులాడి 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 45 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కివీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇదే మైదానంలో జనవరి 26 ఆదివారం జరగనుంది.