మొట్టమొదటి సారి ఐస్‌క్రీం తిన్న పాప.. అబ్బురపరుస్తోన్న వీడియో
- టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేసిన తల్లి
- వైరల్ అవుతోన్న వీడియో
- ఐస్‌క్రీమ్‌ను గట్టిగా పట్టుకుని ఇష్టంగా తిన్న పాప
ఆ పాప పేరు బ్లేక్లీ.. ఆమె తల్లి బ్రిటారి జెర్నిగాన్ తన టిక్‌టాక్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఆ పాప చాలా ఇష్టంగా ఐస్‌క్రీమ్‌ను తింటున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఆమె హావభావాలు వెలకట్టలేనివిగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.