Amaravati: బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు: పవన్ కల్యాణ్‌పై విజయసాయి రెడ్డి సెటైర్

  • దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు
  • రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికాడు 
  • ఇప్పుడు తెలివిలోకి వచ్చాడు
  • రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిపోయాడన్న విధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.

'దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Amaravati
Andhra Pradesh
Vijay Sai Reddy

More Telugu News