Yanamala: శాసన మండలికి మద్యం తాగి వచ్చారు.. గుట్కాలు నమిలారు: యనమల
- శాసన మండలిని రద్దు చేయడం జగన్ వల్ల కాదు
- సభలో ఎన్నడూ చూడని పరిణామాలను చూశాం
- ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలపై తాము పోరాడతాం
శాసనమండలికి నిన్న కొంత మంది మద్యం తాగి వచ్చారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు గుట్కాలు కూడా నములుతూ కనపడ్డారని తెలిపారు. శాసన మండలిని రద్దు చేయడం జగన్ వల్ల కాదని అన్నారు. మండలి రద్దుకు తాము ఎప్పుడూ బాధపడమని, అలాగే, భయపడబోమని మరోసారి స్పష్టం చేశారు.
సభలో ఎన్నడూ చూడని పరిణామాలను ఏపీ మంత్రుల వల్ల నిన్న చూశామని యనమల చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను గతంలో సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్‌గానూ పని చేశానని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో రాజధానిపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి తగిన సమయం అవసరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలపై తాము పోరాడతామని స్పష్టం చేశారు.