మరణదండన ఖరారైతే వారం రోజుల్లోనే అమలు: సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం!
- డెత్ వారెంట్ జారీ అయితే వారం రోజుల్లో శిక్ష
- బాధితుల తరఫున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి
- సుప్రీంకోర్టులో కేంద్ర హోమ్ శాఖ పిటిషన్
ఉరిశిక్ష విషయంలో దోషుల హక్కుల గురించి కాకుండా, బాధితుల తరఫున ఆలోచిస్తూ, ఈ మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ పిటిషన్ లో కేంద్రం అభిప్రాయపడింది. దోషులు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే, సహదోషుల రివ్యూ, క్యూరేటివ్ తదితర పిటిషన్లు ఎన్ని ఉన్నా, వాటిని పక్కన బెట్టాలని, అన్ని కోర్టులు, ప్రభుత్వాలు, జైళ్లు ఈ నిర్ణయాన్ని అమలు చేసే ఆదేశాలు ఇవ్వాలని కోరింది. రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే, క్యూరేటివ్ పిటిషన్ దాఖలుకు నిర్ణీత కాలపరిమితిని విధించాలని సూచించింది. కేంద్ర హోమ్ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ పిటిషన్ దాఖలు చేశారు.