చంద్రయాన్-3 పనులు శరవేగంగా సాగుతున్నాయి: ఇస్రో చైర్మన్ శివన్

  • చంద్రయాన్-3పై ఇస్రో అప్ డేట్
  • నలుగురు వ్యోమగాముల ఎంపిక
  • రష్యాలో శిక్షణ
ఇస్రో చైర్మన్ కె.శివన్ చంద్రయాన్-3పై తాజా వివరాలు వెల్లడించారు. చంద్రయాన్-3 కార్యక్రమం షురూ అయిందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని, ఈ నెలాఖర్లో వారు రష్యాలో శిక్షణ పొందుతారని వివరించారు. 1984లో సోవియట్ వ్యోమనౌక ద్వారా రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేశాడని, ఇప్పుడు భారత వ్యోమనౌక ద్వారా భారతీయులు రోదసి యాత్రలో పాల్గొంటున్నారని చెప్పారు. రోదసిలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 2న నాటి సోవియట్ యూనియన్ కు చెందిన సోయుజ్ టి-11 వ్యోమనౌకలో ప్రయాణించి అంతరిక్షంలోకి వెళ్లాడు.
Go Back to Shorts
ISRO
Sivan
Chandrayann-3
Astronauts
Russia

More Telugu News