ఆకర్షణీయ ఫీచర్లతో హ్యుందాయ్ సరికొత్త కారు... 'ఆరా'!
- సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్లో కొత్త మోడల్ తీసుకువచ్చిన హ్యుందాయ్
- మారుతి సుజుకీ డిజైర్, హోండా అమేజ్ లకు పోటీ ఇచ్చే అవకాశం
- ధర రూ.5.8 లక్షల నుంచి ప్రారంభం
దీనికి డీఆర్ఎల్ (డే టైమ్ రన్నింగ్ లైట్లు), ట్రయాంగిల్ ఫాగ్ ల్యాంప్, జెడ్ ఆకారంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ అమర్చారు. రెండు వైపులా 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటితో కూడిన 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఎంటర్టయిన్ మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. మరింత భద్రత కోసం హ్యుందాయ్ ఆరాను 65 శాతం అడ్వాన్స్ డ్ హై స్ట్రెంగ్త్ స్టీల్ తో తయారుచేశారు. అంతేకాదు, రెడ్, పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, ఆల్ఫా బ్లూ, వింటేజ్ బ్రౌన్ రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది.