నేపాల్ హోటల్లో ఎనిమిది మంది భారతీయుల మృతి
- హీటర్ కారణంగా.. ఊపరి అందక చనిపోయారని ప్రకటన
- మృతుల్లో రెండు జంటలు.. నలుగురు పిల్లలు
- విచారణ జరుపుతోన్న పోలీసులు
ఈ రోజు ఉదయం గదుల్లోని వారు బయటకు రాకపోవడంతో హోటల్ సర్వీస్ సిబ్బంది, రిసార్ట్ యజమానికి తెలిపారు. యజమాని ఆదేశాలతో తలుపులు పగులగొట్టి చూడటంతో.. లోపల ఉన్నవారు మరణించి ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రవీణ్ కుమార్ యాదవ్(39), శరణ్య (34), రంజిత్ కుమార్(39), ఇందు రిజిత్ (34), శ్రీ భద్ర(9), అబినబ్ సోరయ(9), అభినాయర్(7), భైష్ణబ్ రంజిత్(2) ఉన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.