జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై ఏపీ కాంగ్రెస్ స్పందన
- అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు
- కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమంలో పాల్గొంటారని ప్రకటన
- జగన్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్న శైలజానాథ్
- మూడు రాజధానుల ప్రతిపాదన ముమ్మాటికీ మంచిది కాదని వ్యాఖ్య
మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని శైలజానాథ్ మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించి రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన ముమ్మాటికీ ఏపీకి మంచిది కాదని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వ తీరుపై తాము పోరాడతామని తెలిపారు.