ఆస్ట్రేలియాలో మరో ప్రకృతి విపత్తు.. విరుచుకు పడ్డ ఇసుక తుపాను!
- మరోపక్క భారీ వర్షాలు, వడగళ్ల వానలు
- తుపాను హెచ్చరికలను జారీ చేసిన వాతావరణ శాఖ
- కాన్ బెర్రాలో గోల్ఫ్ బంతుల పరిమాణంలో వడగళ్లు
ఇసుక తుపాన్ మూలంగా న్యూ సౌత్ వేల్స్ టౌన్ ఒక్కసారిగా చీకటిగా మారింది. దుమ్ము దుప్పటిలా పరుచుకుంది. క్వీన్స్ లాండ్, విక్టోరియా, న్యూసౌత్ వేల్స్, దేశ రాజధాని కాన్ బెర్రాలో తీవ్ర తుపాను హెచ్చరికలను అక్కడి వాతావరణ శాఖ జారీచేసింది. కాన్ బెర్రా లోని పార్లమెంట్ భవనంలో గోల్ఫ్ బంతుల పరిమాణంలో వడగండ్లు పడ్డాయని తెలుస్తోంది. స్థానికులు ఈ ఇసుక తుపాన్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మీరు కూడా వాటిని చూడచ్చు.