Andhra Pradesh: జగన్ మోచేతి నీళ్లు తాగుతూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు: కొడాలి నానిపై దేవినేని ఉమ ఫైర్

  • అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
  • జగన్ తొత్తు అంటూ మండిపడిన దేవినేని ఉమ
  • సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడని మండిపాటు
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నెలకొన్న పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మండిపడ్డారు.

కొడాలి నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, వైఎస్ జగన్ మోచేతి నీళ్లు తాగుతూ, తొత్తులా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలు దెబ్బలు తిని, చొక్కాలు చినిగిపోయిన స్థితిలో ఉంటే, మహిళలను దారుణంగా కొడుతున్న పరిస్థితులు కనిపిస్తుంటే కొడాలి నాని పైశాచికంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

"చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద బాధ్యత లేకుండా సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. తప్పకుండా అనుభవిస్తాడు. రాజధానిని తరలించేందుకు జగన్ మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా న్యాయదేవత కాపాడుతుంది" అంటూ ఉమ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Amaravati
AP Capital
Kodali Nani
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News