Andhra Pradesh: జగన్, సజ్జల ఉదయం నుంచీ నన్ను రిమాండ్ కు పంపాలని చాలా ప్రయత్నాలు చేశారు: దేవినేని ఉమ

  • అమరావతి కోసం దేవినేని ఉమ నిరసన
  • మద్దతుదారులతో కలిసి నినాదాలు
  • ట్విట్టర్ లో స్పందన
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి కోసం రోడ్డెక్కారు. అమరావతి మద్దతుదారులతో కలిసి ఆయన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు వీడియోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఉదయం నుంచి తనను రిమాండ్ కు పంపడానికి చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో జగన్ కు 6093 నెంబర్ ఉన్నట్టు, తప్పుడు ఫిర్యాదులతో తనను సబ్ జైలుకు పంపాలని చూశారని ట్వీట్ చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ, అమరావతిని కాపాడుకునేందుకు శాసనసభ, మండలిలో పోరాటం సాగిస్తామని చెప్పారు.
Andhra Pradesh
Amaravati
AP Capital
Telugudesam
Devineni Uma
Jagan
Sajjala
YSRCP

More Telugu News