Kannababu: మంగళగిరి, తాడికొండలో టీడీపీ ఓడిపోలేదా? అది రెఫరెండం కాదా?: మంత్రి కన్నబాబు

  • విశాఖపై మావోయిస్టుల ప్రభావం ఉందని చెప్పడం సరికాదు
  • విశాఖ దూరం అనేది సమస్యే కాదు
  • శ్రీకాకుళం నుంచి హైదరాబాదుకు వెళ్లడం లేదా?
విశాఖ నుంచే పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని మంత్రి కన్నబాబు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ ఇప్పుడు మహానగరంగా అవతరించిందని చెప్పారు. విశాఖపై మావోయిస్టుల ప్రభావం ఉందంటూ దుష్ప్రచారం చేయడం మంచిది కాదని అన్నారు. హైదరాబాద్ సమీపంలోనే అప్పటి హోంమంత్రి మాధవరెడ్డిని హత్య చేశారని... అంతమాత్రాన రాజధానిని హైదరాబాద్ నుంచి మార్చారా? అని ప్రశ్నించారు. రాజధాని దూరం అనేది సమస్యే కాదని చెప్పారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాదుకు వెళ్లడం లేదా? అని అడిగారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడం లేదా? అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలోనే ఉన్న మంగళగిరి, తాడికొండలో టీడీపీ ఓడిపోయిందని... అది రెఫరెండం కాదా? అని అడిగారు. అమరావతిలోనే అసెంబ్లీ కొనసాగుతుందని చెప్పారు.
Kannababu
Jagan
YSRCP
Amaravati
Vizag

More Telugu News