Andhra Pradesh: అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని... వీడియో ఇదిగో!

  • బిల్లుకు అభ్యంతరం తెలిపిన అచ్చెన్నాయుడు
  • విచారణ జరిపించాలంటూ సీఎంను కోరిన స్పీకర్
  • స్పీకర్ ను ప్రశ్నించిన అచ్చెన్నాయుడు
అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వికేంద్రీకరణ బిల్లుల సందర్భంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపేందుకు ప్రయత్నించగా, స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అచ్చెన్నాయుడు గారూ మీకు సెన్స్ ఉండాలి' అంటూ హెచ్చరించారు. విపక్ష సభ్యులు హద్దుల్లో ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కోరుతున్నానంటూ స్పీకర్ తమ్మినేని మాట్లాడుతుండగా, టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు.

విచారణ జరిపించాలని మీరెలా చెబుతారు? అంటూ స్పీకర్ ను వారు ప్రశ్నించారు. దాంతో తమ్మినేని "డోంట్ టాక్ రబ్బిష్!" అంటూ మండిపడ్డారు. "విచారణ జరిపించాలని కోరే అధికారం స్పీకర్ కు ఉందో లేదో చెప్పడానికి మీరెవరు? మీరెవరు నన్ను ప్రశ్నించడానికి? ఓ విపక్ష సభ్యుడు స్పీకర్ ను ప్రశ్నించడమేంటి?" అంటూ ప్రశ్నించారు.

Andhra Pradesh
Amaravati
AP Capital
Assembly
Tammineni Sitharam
Atchennaidu
Telugudesam
YSRCP

More Telugu News