అల్లరి నరేశ్ తాజా చిత్రం షూటింగుకు 'నాంది'!
- 56 సినిమాలు పూర్తి చేసిన 'అల్లరి' నరేశ్
- విభిన్నమైన కథాకథనాలతో 'నాంది'
- కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్
దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశాన్ని అల్లరి నరేశ్ పై చిత్రీకరించారు. సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. హరీశ్ ఉత్తమన్ .. ప్రియదర్శి .. ప్రవీణ్ .. వినయ్ వర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతవరకూ 56 సినిమాలను పూర్తి చేసిన అల్లరి నరేశ్, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నాడు.