Yeman: యెమెన్ లో సైనికులపై డ్రోన్ దాడి... 80 మంది దుర్మరణం!

  • మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులు
  • భారీ శబ్దంతో పేలిన డ్రోన్ క్షిపణి
  • 150 మందికి గాయాలు
యెమెన్‌ మరోసారి రక్తసిక్తమైంది. ఓ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు డ్రోన్‌ క్షిపణిని ప్రయోగించడంతో 80 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. హుతి తిరుగుబాటుదారులే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు. మరిబ్‌ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది. సైనిక శిబిరంలో ఏర్పాటు చేసిన మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ భారీ శబ్దంతో డ్రోన్ బాంబు పేలింది. ఈ ఘటనలో సుమారు 150 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు.

యెమెన్‌ లో దాదాపు ఆరేళ్ల క్రితం అంతర్యుద్ధం మొదలైన తరువాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి తెలిపారు. యెమెన్‌ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా, ఇరాన్ పాలకులు హుతి తిరుగుబాటుదారులకు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. తాజా దాడిపై తిరుగుబాటు నేతలు ఇంకా స్పందించలేదు.
Yeman
Drone
Missile
Died
Army
Maszid

More Telugu News