Kanna Lakshminarayana: హస్తిన నుంచి పిలుపు... హుటాహుటిన వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణ!

  • ఆదివారం రాత్రి న్యూఢిల్లీకి పయనం
  • ఒంటరిగానే వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు
  • జేపీ నడ్డా నామినేషన్ కార్యక్రమానికేనన్న ఓ వర్గం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న రాత్రి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ అధిష్ఠానం నుంచి, అత్యవసరంగా రావాలని పిలుపు వచ్చిన నేపథ్యంలో ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం, మార్పులు జరుగుతున్న నేపథ్యంలో కన్నా, ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కాగా, ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ యువనేతను నియమిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకే కన్నా లక్ష్మీనారాయణ న్యూఢిల్లీకి వెళ్లారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది. 
Kanna Lakshminarayana
BJP
New Delhi
Andhra Pradesh

More Telugu News