Andhra Pradesh: సుప్రీంకోర్టు, రాష్ట్రపతి అంగీకరిస్తేనే హైకోర్టు ఇక్కడినుంచి కదులుతుంది: కేశినేని నాని

  • విజయవాడ బార్ అసోసియేషన్ భేటీలో పాల్గొన్న కేశినేని నాని
  • అమరావతి కోసం పార్లమెంటులో పోరాడుతామని వెల్లడి
  • హైకోర్టును కదిపే అధికారం ప్రభుత్వానికి లేదని ఉద్ఘాటన
టీడీపీ ఎంపీ కేశినేని విజయవాడ బార్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి ఉద్యమం అణచివేతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. హైకోర్టును కదిపే అధికారం, హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి అంగీకరిస్తేనే హైకోర్టు ఇక్కడినుంచి కదులుతుందని అన్నారు. అమరావతిని కాపాడుకోవడమే లక్ష్యంగా పార్లమెంటులో పోరాడుతామని కేశినేని నాని ఉద్ఘాటించారు.
Andhra Pradesh
Amaravati
High Court
Kesineni Nani
Vijayawada
Supreme Court
President Of India

More Telugu News