Andhra Pradesh: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కిన రాజధాని రైతులు.. ఆందోళనలో కుటుంబసభ్యులు

  • రాజధాని రైతుల ఆందోళనలు
  • మూడు రాజధానుల ఆలోచన విరమించుకోవాలని డిమాండ్
  • ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదంటున్న రైతులు
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన విరమించుకోవాలంటూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు రైతులు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కిన వారు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఆ ముగ్గురు రైతుల కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి పట్ల కన్నీటిపర్యంతమవుతున్నారు. రాజధాని కోసం తాము పొలాలు ఇచ్చామని, తాము సన్నకారు రైతులమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఇక్కడి నుంచి తరలివెళితే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు.
Andhra Pradesh
Amaravati
MLA Quarters
Farmers
YSRCP
Jagan

More Telugu News