లండన్ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్ వైద్యురాలు.. మృతి
- గుండెపోటుతో మరణించిన డాక్టర్ మీనాకుమారి
- మీనాకుమారి స్వస్థలం తమిళనాడు
- పాతికేళ్లుగా నిమ్స్ లో సేవలందిస్తున్న డాక్టర్
కార్యక్రమ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాకుమారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మీనాకుమారి తమిళనాడుకు చెందినవారు. నిమ్స్ లో గత పాతికేళ్లుగా సేవలందిస్తున్నారు. డాక్టర్ మీనా కుమారి హఠాన్మరణంతో నిమ్స్ వర్గాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి. ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.