క్రికెట్లో విషాదం.. బంతి తగిలి బాలుడి మృతి!
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఘటన
- స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు
- బంతి ఛాతీకి తాకడంతో కుప్పకూలి మరణించిన వైనం
ఈ క్రమంలో మరో బాలుడు కొట్టిన బంతి వేగంగా వచ్చి మైనుద్దీన్ ఛాతీ భాగంలో బలంగా తాకింది. బాలుడు కుప్పకూలిపోవడంతో మిగతా బాలురు హడలిపోయారు. గమనించిన స్థానికులు బాలుడికి నీళ్లు తాగించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు. కుమారుడు లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు ఖాజా, షాహిదా బేగం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.