Dil Raju: 'ఎవరు' డైరెక్టర్ తో దిల్ రాజు ప్రాజక్ట్

  • 'ఎవరు'తో హిట్ ఇచ్చిన వెంకట్ రాంజీ
  • కొత్త కథతో 'దిల్' రాజు దగ్గరికి 
  • ఒక కథానాయకుడిగా మెగా హీరో
కథాకథనాలపై 'దిల్' రాజుకి మంచి పట్టువుంది. వాటి విషయంలో ఆయన జడ్జిమెంట్ తప్పిన సందర్భాలు తక్కువ. ఆయన నిర్మించిన సినిమాలు చాలావరకూ విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఇక కంటెంట్ లో విషయం ఉండాలేగానీ, మల్టీస్టారర్ సినిమాలు నిర్మించడంలోనూ ఆయన ముందే వుంటారు. తాజాగా ఆయన మరో మల్టీస్టారర్ ను నిర్మించనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

'ఎవరు' సినిమాతో హిట్ కొట్టిన వెంకట్ రాంజీ వినిపించిన కథ నచ్చడంతో, నిర్మాతగా 'దిల్' రాజు రంగంలోకి దిగుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ మల్టీ స్టారర్ కథలో ఒక మెగా హీరో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో హీరోను కూడా ఎంపిక చేసుకుని డేట్స్ ఓకే చేసుకుంటే, ఆ తరువాత పనులు చకచకా జరిగిపోతాయని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Dil Raju
Venkat Ramji

More Telugu News