Komatireddy: కేసీఆర్, కేటీఆర్ లపై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • కేసీఆర్ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయింది
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం
  • మాకు బాస్ వున్నారు కాబట్టే తెలంగాణ ఇచ్చారు
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ నుంచి వారిద్దరినీ బయటకు లాక్కొచ్చి... పంజాగుట్ట చౌరస్తాలో పిల్లర్ కు కట్టేసి కొట్టినా పాపం లేదని వ్యాఖ్యానించారు.

నల్గొండలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదని, పేదవారికి ఇళ్లు లేవని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని చెప్పారు. ఢిల్లీలో వాళ్లకు బాస్ లు ఎవరూ లేరని... తమకు బాస్ ఉన్నారు కాబట్టే తెలంగాణను ఇచ్చారని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వెనుకబడిపోయిందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను గాలికొదిలేశారని విమర్శించారు. 
Komatireddy
Congress
TRS
KCR
KTR

More Telugu News