Jagan: జగన్ పిటిషన్లను తిరస్కరించిన సీబీఐ కోర్టు

  • సీబీఐ కోర్టులో జగన్ కు చుక్కెదురు
  • అన్ని ఛార్జిషీట్లను కలిపి విచారించాలన్న అభ్యర్ధన తిరస్కరణ
  • ఈడీ విచారణను నిలిపివేయాలన్న పిటిషన్ కొట్టివేత 
అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైదరాబాదులోని సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. 5 ఛార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ ను కొట్టేసింది. దీంతోపాటు, సీబీఐ విచారణ ముగిసే వరకు ఈడీ విచారణను నిలిపివేయాలనే మరో పిటిషన్ ను కూడా తిరస్కరించింది. మరోవైపు, క్విడ్ ప్రోకో కేసుల్లో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఈ రోజు విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, వచ్చే వారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

More Telugu News

Jagan
YSRCP
CBI