Janasena: కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేతల భేటీ

  • కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో సమావేశం
  • ఇరు పార్టీల మధ్య పొత్తు ఏర్పడడం శుభ పరిణామమన్న జనసేన నేతలు
  • ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వైసీపీ పరిపాలన సాగించాలని హితవు .
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో ఆయనను ఈ రోజు ఉదయం పలువురు జనసేన నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో లక్ష్మీనారాయణతో జనసేన నేతలు చర్చించారు. ఆయనతో భేటీ ముగిసిన అనంతరం శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... ఇరు పార్టీల మధ్య పొత్తు ఏర్పడడం శుభ పరిణామంగా భావిస్తున్నామని తెలిపారు.

ఏపీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వైసీపీ పరిపాలన సాగించాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే సర్కారుపై తాము ఒత్తిడి తెస్తామని, రానున్న రోజుల్లో బీజేపీతో కలిసి సమస్యలపై పోరాడతామని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు సమాన దూరంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము సత్తా చాటుతామన్నారు.
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News