ఇద్దరే ప్రయాణికులు, రోజువారీ ఆదాయం రూ.20.... ఇదీ ప్రధాని ప్రారంభించిన ఓ రైల్వేస్టేషన్ పరిస్థితి!
- ఒడిశాలో రైల్వేష్టేషన్
- రైల్వే లైన్ ఖర్చు రూ.115 కోట్లు
- ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం
బిచ్చుపాలి రైల్వే స్టేషన్ నుంచి రోజు మొత్తం మీద ప్రయాణించేది ఇద్దరేనని, వారి ద్వారా రూ.20 ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. బొలంగిర్ నుంచి బిచ్చుపాలికి రైల్వే లైన్ వేయడానికి, ఇక్కడ స్టేషన్ నిర్మించడానికి రూ.115 కోట్లు ఖర్చయింది. కానీ స్టేషన్ నిర్వహణకు రోజుకు ఎంత ఖర్చవుతుందో మాత్రం అధికారులు చెప్పలేదు.