Nara Lokesh: వీలైతే ఒకసారి వినండి.. లేదంటే మీ ఇష్టం: జగన్ కు నారా లోకేశ్ సూచన

  • 30వ రోజుకు చేరుకున్న రాజధాని నిరసనలు
  • ఓ విద్యార్థి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన లోకేశ్
  • రాష్ట్ర యువత చెబుతున్నారు వినాలంటూ జగన్ కు సూచించిన లోకేశ్
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 30వ రోజుకు చేరుకుంది. మరోవైపు నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. తమ తల్లిదండ్రులు చేపట్టిన ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడిన వీడియోను టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 'రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అభివృద్ధి గురించి రాష్ట్ర యువత చెబుతున్నారు. వీలైతే ఒకసారి వినండి. మంచి వినం, చూడం, మాట్లాడం అంటే మీ ఇష్టం' అని ట్వీట్ చేశారు.
Nara Lokesh
Jagan
Amaravati
Telugudesam
YSRCP

More Telugu News