Allu Arjun: నా శ్రమను గుర్తించావు... థాంక్యూ శర్వా!: అల్లు అర్జున్

  • 'అల... వైకుంఠపురములో' చిత్రంపై శర్వానంద్ స్పందన
  • ప్రతి ఫ్రేములో బన్నీ చంపేశాడంటూ వ్యాఖ్యలు
  • సంతోషం వ్యక్తం చేసిన బన్నీ
'అల... వైకుంఠపురములో' చిత్రంపై హీరో శర్వానంద్ ట్విట్టర్ లో స్పందించడం పట్ల అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చాడు. 'అల... వైకుంఠపురములో' సినిమా చూశానని, ప్రతి ఫ్రేములో బన్నీ చంపేశాడని శర్వా పొగడ్తల జల్లు కురిపించాడు. ఈ సినిమాలో బన్నీ నటన ఓ నటుడిగా తనకు పాఠం లాంటిదని శర్వా అభిప్రాయపడ్డాడు.

దీనిపై బన్నీ స్పందిస్తూ, "మైడియర్ శర్వా... సహృదయంతో నువ్వు చేసిన వ్యాఖ్యలకు థాంక్యూ సో మచ్. మా చిత్రాన్ని, అందులో నా శ్రమను గుర్తించావు... అందుకు ఎంతో సంతోషిస్తున్నా" అంటూ బదులిచ్చాడు. జనవరి 12న రిలీజైన అల... వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈజీగా వంద కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లింది.
Allu Arjun
Ala Vaikunthapuramulo
Tollywood
Sharwanand
Trivikram

More Telugu News