Sri Devi: 'దేవత' సమయంలో శ్రీదేవి .. జయప్రద మాట్లాడుకునేవారు కాదు: దర్శకుడు బి.గోపాల్

  • 'దేవత' సినిమాకి పనిచేశాను 
  • శ్రీదేవి - జయప్రద అలా వుండే వారు 
  •  అక్కాచెల్లెళ్ల పాత్రల్లో జీవించారన్న బి.గోపాల్  
తెలుగులో నిన్నటి తరం అగ్రదర్శకుడిగా బి.గోపాల్ కనిపిస్తారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమాలను సమర్ధవంతంగా తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది. దర్శకుడు కాకముందు ఆయన రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా చాలా కాలం పాటు పనిచేశారు. అలా అయన అసోసియేట్ గా పనిచేసిన సినిమాల్లో 'దేవత' ఒకటి.

తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ సినిమాను గురించి మాట్లాడుతూ .."ఈ సినిమా సెట్లో అందరం చాలా సరదాగా ఉండేవాళ్లం .. ఒక్క శ్రీదేవి - జయప్రదగారు తప్ప. ఎందుకో తెలియదుగానీ వాళ్లిద్దరూ మాట్లాడుకునేవాళ్లు కాదు. కెమెరా ముందుకు రాగానే నిజంగానే వీళ్లు అక్కా చెల్లెళ్లా? అనుకునేట్టుగా నటించేవాళ్లు. టేక్ ఓకే కాగానే చెరో వైపుకు వెళ్లి కూర్చునేవారు. బయట ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా, వాళ్లు అక్కాచెల్లెళ్ల పాత్రల్లో జీవించడం గొప్ప విషయం" అని చెప్పుకొచ్చారు.
Sri Devi
Jayaprada

More Telugu News