చెగువేర ఆదర్శమని చెప్పుకున్న పవన్ కల్యాణ్ చెంగువీర అయ్యారు: రామకృష్ణ
- బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలి
- ఆయనకు నడ్డా బందరు లడ్డూలు ఇచ్చారా?
- దమ్మున్నవాళ్లే బీజేపీని విమర్శించగలరు
ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్తున్న నేతలంతా జేఎన్యూకు వెళ్తున్నారని... కేవలం పవన్ మాత్రమే బీజేపీ ఆఫీసుకు వెళ్లారని రామకృష్ణ వ్యంగ్యంగా అన్నారు. చెగువేర తనకు ఆదర్శమని చెప్పుకున్న పవన్... ఇప్పుడు చెంగువీర అయ్యారని ఎద్దేవా చేశారు. కేవలం దమ్మున్నవారే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరని ఆయన అన్నారు. మరి పవన్ కు దమ్ముందో, లేదో ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.