బీజేపీ, జనసేన పొత్తుతో వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
- రెండు బలహీనమైన పార్టీలు బలపడే ప్రయత్నమిది
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది
- ఆ పొత్తు ఫలితం తేలాలంటే నాలుగున్నరేళ్లు ఆగాలి
ఈ రోజు రెండు పార్టీల మధ్య విజయవాడలో భేటీ జరగనున్న నేపథ్యంలో ఎంపీ ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల విధానాలేమిటో ఈరోజు సాయంత్రంలోగా తేలుతుందని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేయొచ్చని చెప్పారు. ఏదిఏమైనా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఒనగూరే ఫలితం ఏమిటన్నది తేలాలంటే నాలుగున్నరేళ్లపాటు ఆగాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.