ఎన్నార్సీపై సమావేశానికి డుమ్మా కొట్టనున్న టీఎంసీ
- ఎన్నార్సీపై రేపు సమావేశాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- ఎన్నార్సీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మమత
- తన మరణం తర్వాతే అది సాధ్యమంటూ వ్యాఖ్య
పశ్చిమబెంగాల్ లో కేంద్ర ప్రభుత్వం ఎన్నార్సీని అమలు చేయాలనుకుంటే... అది తన మరణం తర్వాతే సాధ్యమని మమత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వారం ఓ సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజల హక్కులకు తాను కాపలాదారుని అని చెప్పారు. ఎన్నార్సీని అమలు చేయడం అనుకున్నంత సులభం కాదని... ఎవరూ భయపడవద్దని అన్నారు.