Chandrababu: మహిళలపై చేయిచేసుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదు: నారా భువనేశ్వరి

  • మందడం రైతుల దీక్షకు భువనేశ్వరి సంఘీభావం
  • చంద్రబాబు పిలుపు మేరకు రైతులు భూములిచ్చారు
  • చంద్రబాబు గొప్ప రాజధాని నిర్మిస్తారనే నమ్మకంతో త్యాగాలు చేశారు
  • రైతులకు రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారు
అమరావతి రాజధాని కోసం మందడం రైతులు చేస్తోన్న దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఆయన పిలుపు ఇవ్వడంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు గొప్ప రాజధాని నిర్మిస్తారనే నమ్మకంతో రైతులు ఆనాడు త్యాగాలు చేశారని, రైతులకు రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారని చెప్పారు.

రాజధాని కోసం తాను కష్టపడి సంపద సృష్టించి ప్రజలకే ఇస్తానని చంద్రబాబు చెప్పేవారని భువనేశ్వరి తెలిపారు. ఆ నమ్మకం చంద్రబాబుకు ఉండేదని చెప్పారు. మహిళలపై చేయిచేసుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని ఆమె అన్నారు. దాడులు జరుగుతున్నప్పటికీ  మహిళలు భయపడకుండా రాజధాని కోసం పోరాడుతున్నారని ఆమె ప్రశంసించారు.
Chandrababu
Andhra Pradesh
Amaravati

More Telugu News